రమదాన్ స్కూల్ సమయాల్ని ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్

- March 24, 2022 , by Maagulf
రమదాన్ స్కూల్ సమయాల్ని ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి పవిత్ర రమదాన్ మాసంలో సమయాల్ని ఆమోదించడం జరిగింది. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తదునుగుణమైన సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. క్లాస్ సమయం 35 నిమిషాలు వుండాలి. ఎలిమెంటరీ, ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ ఫేజ్ స్కూళ్ళు 9 గంటల నుండి ప్రారంభమై, ఆయా అకడమిక్ షెడ్యూల్ పరంగా పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ సమయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అన్ని గవర్నరేట్లలోని ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మినిస్ట్రీ అప్పగించింది. కాగా, రమదాన్ సెలవులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com