రియల్‌ ఎస్టేట్‌ కోసం కొత్త ‘చట్టం’

- June 11, 2015 , by Maagulf
రియల్‌ ఎస్టేట్‌ కోసం కొత్త ‘చట్టం’

ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యన్, అబుదాబి రియల్‌ ఎస్టేట్‌కి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలన్నీ ఓ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మున్సిపల్‌ ఎఫైర్స్‌ అనుమతి లేకుండా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలేవీ జరగకుండా ఈ చట్టాన్ని రూపొందించారు. అమ్మకం, కొనుగోలు ఇలా ఏ లావాదేవీ అయినాసరే, ఆ రిజిస్టర్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రియల్‌ ఎస్టేట్‌లో తలెత్తే సమస్యల నుంచి వినియోగదారులు, అమ్మకందార్లు ఉపశమనం పొందుతారని ప్రభుత్వం చెబుతుంది. వినియోగదారులకు ఉన్న హక్కుల్ని సంరక్షించేలా కొత్త చట్టం ఉపయోగడుతుందని అంటున్న ప్రభుత్వం, ఈ కొత్త చట్టం ద్వారా రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇంకా ఊపందుకుంటుందనీ, వివాదాల్లేని రియల్‌ ఎస్టేట్‌ రంగానికి దిశానిర్దేశం చూపుతుందని వెల్లడించింది. అనుముతులు, ప్లానింగ్‌, కొనుగోలు, అమ్మకం, లావాదేవీలు ఇలా అన్నీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మున్సిపల్‌ ఎఫైర్స్‌ కనుసన్నల్లో జరగడం వల్ల వినియోగదారుల్లోనూ భద్రత పెరుగుతుందని ప్రభుత్వం అంటుంది.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com