బాలయ్య బాబు జన్మదిన వేడుకలు

- June 10, 2015 , by Maagulf
బాలయ్య బాబు జన్మదిన వేడుకలు

నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.బసవతారకమ్మ కాన్సర్‌ హాస్పిటల్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.కాన్సర్‌ బాధిత చిన్నారులతో సరాదాగా గడిపిన బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదానం, అన్నదానం సహా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అభిమానులను అభినందించారు.బాలకృష్ణ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్‌ను ఆయన అభిమానుల సమక్షంలో కట్‌ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, బసవతారకమ్మ కాన్సర్‌ హాస్పిటల్‌ సి.ఇ.ఓ ఆర్‌.పి.సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com