అషూబాతో భారీ వర్షాలు, పెనుగాలులు
- June 11, 2015
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుపాను యూఈఏ తీరం వైపు దాసుకొస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుంచే అషూబా ప్రభావం యూఏఈలోని పలు చోట్ల స్పష్టంగా కన్పిస్తోంది.. ఒమాన్ తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమైన అషూబా, తీరంపై చూపించబోయే ప్రభావం గురించి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తుపాను కేంద్రం వద్ద వేగం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్లుగా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. యూఏఈ తీర్పు ప్రాంతంలో దట్టంగా మేఘాలు ఆవరించి, కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. యూఏఈపై ప్రత్యక్షంగా ప్రభావం లేకపోయినా, అషూబా ధాటికి భారీ వర్షాలు కురవడం ద్వారా యూఏఈలో నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మున్సిపాలిటీ శాఖ కార్మికుల్ని రంగంలోకి దించింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. సముద్రపు నీరు రోడ్లపైకి రావడాన్ని నియంత్రించేందుకూ తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







