ఆర్జీవీ డైరెక్షన్ లో ఉపేంద్ర
- March 24, 2022
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఆర్జీవి.తనకు నచ్చిన కాన్సెప్ట్ తో విన్నూత్నంగా ఆలోచించి సినిమాలు తీసే ఆర్జీవీ ఈ సారి నటుడు ఉపేంద్రతో రాబోతున్నాడు.
కన్నడనాట తరగని క్రేజ్ సొంతం చేసుకున్న ఉప్పీ..నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ ప్రియులను మెప్పించాడు. కన్యాదానం, ‘ఉపేంద్ర, ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి తెలుగు చిత్రాల్లో హీరోగా, కీలక పాత్రల్లోనూ నటించిన ఉప్పీ.. త్వరలో రాబోయే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘ఘని’లోనూ ఉపేంద్ర కీ రోల్ లో కనిపించనున్నారు. కాగా.. ఇప్పుడు ఆర్జీవీ అండ్ కంపెనీ ఏకంగా ఉప్పీతో సినిమాను ప్రకటించి సెన్సేషనల్ గా మారాడు.
గురువారం వర్మ ఉపేంద్రతో సినిమా మోషన్ టీజర్ ని షోషల్ మీడియా ట్వీట్టర్ వేదికగా విడుదల చేయగా.. `R` అనే టైటిల్ ని ఫిక్స్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. బెంగళూరులో హల్ చల్ సృష్టించిన `R` గ్యాంగ్ దుబాయ్ లో వున్న దీ కంపనీ అధినేత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని కూడా వణికించిందట. అలాంటి `R` పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. `R` ఓ గ్యాంగ్ స్టర్ లా కాకుండా చిన్న టైమ్ స్ట్రీట్ ఫైటర్ గా ప్రారంభించి ఆపై బెంగళూరులోనే కాకుండా ముంబైలోని మాఫియాను దుబాయ్ లో వున్న డీ కంపెనీని కూడా భయభ్రాంతులకు గురిచేశాడట. అలాంటి హడలెత్తించిన `R` పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడని వర్మ ట్వీట్ చేశాడు.
R played by @nimmaupendra was a daredevil gangster who was not scared of anyone in the world and the most successful of all the gangsters in india pic.twitter.com/6VMtDTHIls
— Ram Gopal Varma (@RGVzoomin) March 24, 2022
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







