ఏపీ గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ఎస్టీ కమీషన్ ఛైర్మన్
- March 24, 2022
విజయవాడ: ఏపీ రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ కె.రవిబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రవిబాబు గవర్నర్ కు కమీషన్ పరిధిలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను గురించి వివరించారు.రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ తెగలకు అందవలసిన హక్కుల విషయంలో కమీషన్ తగిన పాత్ర పోషిస్తుందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ షేడ్యూలు తెగలకు ప్రభుత్వ పధకాలు పూర్తిగా చేరేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్ టి జనాభా ఎంత అన్న విషయంపై అరా తీసారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టి తెగల సంక్షేమం కోసం విభిన్న పధకాలు అందిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా సమాజంలో అర్ధిక స్వావలంబన సాధించాలని సూచించారు.ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







