ఏప్రిల్ 1 నుంచి ఇండియాకి వీక్లీ విమానాల్ని పెంచనున్న ఎమిరేట్స్
- March 25, 2022
యూఏఈ: కోవిడ్ పాండమిక్ కంటే ముందున్న సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించేందుకోసం ఎమిరేట్స్ చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఇండియాలోని వివిధ నగరాలకు వారంలో 170 విమాన సర్వీసుల్ని నడపనుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల కల్పించిన వెసులుబాట్ల నేపథ్యంలో ఎమిరేట్స్ ఈ చర్యలు తీసుకుంటోంది. కాగా, ఫ్లెక్సిబుల్ బుకింగ్ పాలసీలను కూడా మే 31 వరకు పొడిగించింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. ముంబైకి వారంలో 35 విమానాలు, న్యూ ఢిల్లీకి 28 విమానాలు, బెంగళూరుకి 24 విమానాలు, చెన్నయ్ 21 విమానాలు, హైద్రాబాద్ 21 విమానాలు, కోచి 14 విమానాలు, కోల్కతా 11, అహ్మదాబాద్ 9, తిరువనంతపురం 7 వీక్లీ విమానాలు ఎమిరేట్స్ ద్వారా నిర్వహించబడతాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







