పెళ్లి పీటలు ఎక్కనున్న ఆది పినిశెట్టి, నిక్కీ గాల్రానీ..
- March 26, 2022
హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉన్నా.. వారు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ మొదలయిపోతాయి. కానీ అందులో కొన్ని రూమర్స్ మాత్రం నిజమే అవుతాయి. తాజాగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ, పెళ్లి గురించి రూమర్స్ నిజమే అని తేలిపోయింది. ఈ నెల 24న వీరిద్దరు సన్నిహితుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని వారు నేడు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగా ఎప్పుడో పరిచయమయినా.. ఆది పినిశెట్టికి గుర్తింపు రావడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు'లో ఆది చేసిన విలన్ పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటినుండి హీరోగా, విలన్‌గా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. హీరోయిన్‌గా పరవాలేదనిపించుకుంది సంజనా గల్రానీ. ఆ తర్వాత తన చెల్లెలు నిక్కీ గల్రానీని హీరోయిన్‌గా పరిచయం చేసింది. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే దాదాపు అన్ని సౌత్ భాషలను చుట్టేసింది నిక్కీ. ఆదితో కలిసి రెండు సినిమాల్లో నటించింది. అప్పటినుండే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని సమాచారం.
ఆది, నిక్కీ మధ్య ప్రేమ అన్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఈ జంట వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి తోడు ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా జతచేర్చింది నిక్కీ. 'ఒకరికి ఒకరు జీవితాంతం కలిసుండడమే జీవితంలో బెస్ట్ థింగ్. మేము ఒకరినొకరం ఎన్నో సంవత్సరాల క్రితమే కలుసుకున్నాం కానీ ఇప్పుడు ఇది అఫీషియల్ అయిపోయింది. 2022 మార్చి 24 మాకు చాలా స్పెషల్. ఇరు కుటుంబాల సమక్షంలో మా ఎంగేజ్‌మెంట్ జరిగింది.ఈ కొత్త ప్రయాణానికి మీ ప్రేమ, ఆశీస్సులు కోరుకుంటున్నాం.' అంటూ నిక్కీ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







