యాదాద్రి పునఃప్రారంభం ..'మహా కుంభ సంప్రోక్షణ' లో పాల్గొన్న సీఎం కేసీఆర్
- March 28, 2022
తెలంగాణ: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం కానున్నది. యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. బాలాలయం నుంచి ప్రారంభమైంది శోభాయాత్ర. స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు మొదలైంది శోభాయాత్ర.
ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు,పలువురు ప్రజా ప్రతినిధులు. అనంతరం 11:55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న 150 మంది రుత్వికులు. మహాకుంభ సంప్రోక్షణ లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శనలో పాల్గొననున్నారు కేసీఆర్. 12.20 నుండి 12.30 శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం. యాదాద్రి ఆలయ పున ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకోనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు దేవస్థానం అధికారులు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్