బహ్రెయిన్‌ని హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- June 11, 2015
అవాలీలోని మహమ్మద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా స్పెషలిస్ట్ కార్డియాక్ సెంటర్‌కి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, వైద్య ప్రపంచంలో ఇదో మైలు రాయిగా అభివర్ణించారు. ఆరోగ్యకరమైన సమాజం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పిన ఖలీఫా, మెరుగైన వైద్యం కోసం ఇకపై విదేశాలకు వెళ్ళే అవసరం లేకుండా, అన్ని రకాల వైద్య సేవలూ అందుబాటులో ఉండేలా వైద్య రంగంపై పూర్తి దృష్టి పెట్టామని చెప్పారు. ప్రపంచ స్థాయి వైద్యం బహ్రెయిన్‌లోనే అందుబాటులో ఉంటుందన్న మెసేజ్ ప్రపంచ దేశాలకు పంపడమే తమ లక్ష్యమన్నారాయన. మెడికల్ టూరిజం హబ్‌లా బ్రహెయిన్ అతి త్వరలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని ఖలీఫా అభిప్రాయపడ్డారు. అందరికీ ఆరోగ్యం అనేది తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన చెప్పారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







