రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
- March 28, 2022
న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల మీదుగా రెండో విడత పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం జరగనుంది.మార్చి 21న తొలి విడతలో భాగంగా 54మందికి పురస్కారాలు అందజేయగా మార్చి 28న జరిగే రెండో విడత కార్యక్రమంలో 74 మందికి పురస్కారాలు అందజేస్తారు.ఢిల్లీ వేదికగా జరగనున్న కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డుల ప్రదానం జరగనుంది.యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణానంతరం అతని కుటుంబీకులకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ మూర్తి ఎల్లా, సుచిత్ర కృష్ణ ఎల్లా పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు.
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం , విద్య, క్రీడలు,పౌర సేవల విభాగాలలో కృషి చేసిన వారికి ఏటా పద్మ అవార్డులతో కేంద్రం సత్కారాలు అందజేస్తుంది.ఈ క్రమంలోనే 2022 సంవత్సరానికి నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.పద్మా అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉండగా 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలతో పాటు విదేశీయులు, ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!







