కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

- March 28, 2022 , by Maagulf
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో వున్న టెర్మినల్ 2 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆరు ఫైర్ ఫైటింగ్ బృందాలు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరికైనా ఎలాంటి ప్రమాదమైనా సంభవించిందా.. అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. అయితే, ఈ ప్రమాదం కారణంగా విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ేవియేషన్ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం వున్న భవనానికి బదులుగా 4.3 మిలియన్ డాలర్లతో టెర్మినల్ 2 నిర్మాణం జరుగుతోంది. 25 మిలియన్ మంది ప్రయాణీకుల్ని ఏడాది కాలంలో ఈ టెర్మినల్ అకామడేట్ చేయగలుగుతుంది. 15,000 కొత్త ఉద్యోగాలు కువైటీలకు రానున్నాయి ఈ భవనం అందుబాటులోకి వస్తే. ఈ ఏడాది ఆగస్టు నాటికి దీన్ని పూర్తి చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com