సోషల్ మీడియా ప్రకటనల్ని నియంత్రించేందుకు చట్టాన్ని ప్రతిపాదించిన ఎంపీ

- March 28, 2022 , by Maagulf
సోషల్ మీడియా ప్రకటనల్ని నియంత్రించేందుకు చట్టాన్ని ప్రతిపాదించిన ఎంపీ

కువైట్: సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల్ని నియంత్రించేందుకోసం ఓ చట్టాన్ని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. ముందస్తుగా మినిస్ట్రీ నుంచి అనుమతి తీసుకుని వ్యక్తులు లేదా సంస్థలు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసేలా చట్టాన్ని రూపొందించాలని ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో వున్న ప్రకటనలు చాలావరకు సమాజానికి హానికరంగా మారుతున్నాయనీ, ఈ నేపథ్యంలోనే వాటిపై నియంత్రణ అవసరమని ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. జాతీయ సమగ్రతకు చేటు తెచ్చే ఇలాంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా వుండాల్సిన అవసరాన్ని ఎంపీలు గుర్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com