ఆర్ఓహెచ్ఎమ్‌కి పదేళ్ళు: పోస్టల్ స్టాంప్ విడుదల

- March 28, 2022 , by Maagulf
ఆర్ఓహెచ్ఎమ్‌కి పదేళ్ళు: పోస్టల్ స్టాంప్ విడుదల

మస్కట్: రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ఆర్ఓహెచ్ఎం) పదో వార్షికోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం జరిగింది. గడచిన పదేళ్ళలో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ సాధించిన విజయాలు చేపట్టిన కాన్సెర్టులు, అంతర్జాతీయ మ్యూజికల్ ప్రదర్శనల గురించి ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్తు చేసుకున్నారు. మార్చి 31 నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్టాంపులు కొనుగోలు చేయవచ్చు. గిఫ్ట్ షాప్, ఒమన్ పోస్ట్ షాప్ అలాగే ఒపెరా గ్యాలరీ వద్ద కూడా ఈ స్టాంపులు లభ్యమవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com