700 గోల్డెన్ వీసాలు మంజూరు చేసిన బహ్రెయిన్

- March 29, 2022 , by Maagulf
700 గోల్డెన్ వీసాలు మంజూరు చేసిన బహ్రెయిన్

బహ్రెయిన్: 700 గోల్డెన్ వీసాలు మంజూరు చేసినట్లు బహ్రెయిన్‌ తెలిపింది. గోల్డెన్ వీసా కోసం ఇప్పటి వరకు 1,680 దరఖాస్తులు అందాయని పేర్కొంది. గత నెలలో బహ్రెయిన్ ప్రభుత్వం ఎంపిక చేసిన విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీని మంజూరు చేసే గోల్డెన్ వీసా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీసా హోల్డర్‌కు బహ్రెయిన్‌లో పని చేసే హక్కు, జీవిత భాగస్వామి, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులకు రెసిడెన్సీ ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే దేశంలోకి అపరిమిత ఎంట్రీ/ఎగ్జిట్ అవకాశాన్ని అందిస్తుంది. గోల్డెన్ వీసా గ్రహీతలు వీసాను నిరవధికంగా పొడిగించడానికి కూడా అనుమతిస్తుంది. వీసా కోసం బహ్రెయిన్‌లో ఐదు సంవత్సరాలు నివాసంతోపాటు నెలకు కనీసం BD2,000 సగటు జీతం పొందాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com