యూఏఈలో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

- March 29, 2022 , by Maagulf
యూఏఈలో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

యూఏఈ: అజ్మన్ లోని అల్ జూర్ఫ్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ హాల్ లో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.అలాగే జ్యోతిర్విద్యా భూషణ, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారయణ మూర్తీ చే  పంచాంగ శ్రవణం ఉంటుంది.తిరమల తరహాలో స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పూజారులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు.  భక్తులకు ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించారు.

షెడ్యూల్:

07.00-08.00 సుప్రభాత సేవ

08.00-10.00 పంచాంగ శ్రవణం

09.00-11.00 హోమం

11.00-14.00 కల్యాణం

11.30-14.00 ప్రసాదం

ఈవెంట్ అసాంతం కీర్తనలు, భజనలు ఆకట్టుకోనున్నాయి. మరింత సమాచారం కోసం 055 5794466/055 9943873 నెంబర్లలో సంప్రదించగలరు.

సూచనలు:

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈవెంట్ లో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు సెక్యూరిటీ గైడ్ లైన్స్ పాటించాలి.

ముఖ్యమైన గమనిక:

రమదాన్ ప్రోటోకాల్స్ ప్రకారం.. వెన్యూలో అన్న ప్రసాదాలను తినడాన్ని అనుమతించరు. భక్తులు ప్రసాదాలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com