ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
- March 29, 2022
అమరావతి: ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. తాడేపల్లి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 11న కేబినెట్ ను ముఖ్యమంత్రి జగన్ విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించి.. ఏప్రిల్ 8న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమై.. పూర్తి సమాచారాన్ని అందించనున్నారు. మంత్రి పదవిని కొత్తగా అవకాశం అందుకోనున్నవారికి.. ఒక రోజు ముందుగా.. అంటే ఏప్రిల్ 10న సమాచారం అందనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ను విస్తరించిన తర్వాత.. పాత, కొత్త మంత్రులందరికీ.. ముఖ్యమంత్రి జగన్ విందు ఇవ్వనున్నారు.
ఇప్పటికే.. ఏపీ మంత్రి వర్గ విస్తరణపై రకరకాల వార్తలు.. రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొట్టాయి. ఓ దశలో.. ముఖ్యమంత్రి జగన్.. స్వయంగా ఈ విషయంపై తన సహచరులకు దిశానిర్దేశం చేశారు. కేబినెట్ విస్తరణ అన్నది.. ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే తీసుకున్న నిర్ణయమని గుర్తు చేశారు. పదవులు పోయిన వారికి పార్టీ జిల్లా బాధ్యతలు అందుతాయని తెలిపారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని జగన్.. క్లియర్ కట్ గా ఎప్పుడో చెప్పేశారు.
అప్పటి నుంచి.. కేబినెట్ లో ఉండేదెవరు.. ఊడేదెవరు.. అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగానే నడిచింది. 95 శాతం మంది మంత్రులను తప్పించి.. తన టీమ్ ను కొత్తగా జగన్ రూపొందించనున్నారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. మరోవైపు.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరు.. తమకు పదవి పోయినా ఇబ్బంది లేదని.. జగన్ ఎలా చెబితే అలా పని చేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలాంటి తరుణంలో.. కేబినెట్ విస్తరణపై ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.
నేటి నుంచి సరిగ్గా 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రూపు రేఖలు మారడం స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం జగన్.. ఏప్రిల్ 8న గవర్నర్ ను కలవనున్నారని.. 11నే విస్తరణ ఉంటుందని తెలుస్తుండడంతో.. మంత్రివర్గంలో ఉండేదెవరో.. ఊడేదెవరో అన్న చర్చ జోరందుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్