పెండింగ్ ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ గడువు పొడిగించిన తెలంగాణ పోలీస్
- March 30, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.ఈ మేర గడువు తేదీ మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్ వినిపించారు.రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల చలాన్లను చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి.పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు చెబుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందన, విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజుల పాటు అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు తెలిపారు.ఇప్పటి వరకూ చలాన్లు చెల్లించలేక పోయినవాళ్లు రాయితీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
తాజా వార్తలు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..