ఢిల్లీలో ముగిసిన బహ్రెయిన్-భారత్ సంప్రదింపులు

- March 31, 2022 , by Maagulf
ఢిల్లీలో ముగిసిన బహ్రెయిన్-భారత్ సంప్రదింపులు

బహ్రెయిన్ : ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత్, బహ్రెయిన్ మధ్య ఐదవ రౌండ్ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ (FOC) మార్చి 28న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి GOIలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (CPV&OIA) డాక్టర్ ఔసఫ్ సయీద్, బహ్రెయిన్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా సహ అధ్యక్షత వహించారు. రెండు ప్రతినిధి బృందాలు ద్వైపాక్షిక సహకారంపై చర్చించాయి. 2021 ఏప్రిల్‌లో న్యూ ఢిల్లీలో ఇండియన్ విదేశాంగ శాఖ, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి నేతృత్వంలో జరిగిన 3వ హై జాయింట్ కమిషన్ సమావేశం నుండి సాధించిన పురోగతిని సమీక్షించాయి. COVID-19 మహమ్మారి విధించిన పరిమితులు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాల్లో పెరుగుదల నమోదు కావడం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇండియా, బహ్రెయిన్ మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు అక్టోబర్ 2021లో స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా భారత్ లో పర్యటించే అంశం కూడా వీరి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. వాణిజ్యం, పెట్టుబడులు, హైడ్రోకార్బన్లు, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, ఔషధాలు, ఐటి, ఫిన్‌టెక్, ఆహార భద్రత, పౌర విమానయానం, అంతరిక్షం, రక్షణ, భద్రత, పార్లమెంటరీ సహకారం, సంస్కృతి, విద్య మరియు ప్రజలు- రంగాలలో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా ఇరు పక్షాలు అంగీకరించారు. యువత, స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్‌లపై కూడా వీరు చర్చించారు. 2021- 22 లో ఇరు దేశాల మధ్య USD 1.4 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com