దోపిడీ కేసులో బహ్రెయిన్ వ్యక్తి నిర్దోషి
- April 01, 2022
బహ్రెయిన్: ఇద్దరు దొంగలను తన కారులో దొంగతనం ప్రాంతానికి తన కారులో తీసుకెళ్లిన బహ్రెయిన్ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా పేర్కొని విడిచిపెట్టింది. దొంగల ప్లాన్ గురించి తెలిసినట్లు ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా పేర్కొంటూ అతడిని విడుదల చేయాలని తీర్పునిచ్చింది. పోలీసుల ఛార్జీషీటు ప్రకారం.. నిందితులు సమీపంలోని మాల్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్ అయిన బహ్రెయిన్ వ్యక్తిని అడిగారు. వారి ఉద్దేశం తెలియని అతడు వారిని సమీపంలోని మాల్ దగ్గరకు తీసుకెళ్లాడు. అనంతరం నిందితులు అక్కడ ఛారిటీ బాక్సులను దొంగిలించి పారిపోయే క్రమంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలో వారికి సహకరించిన డ్రైవర్ ను సైతం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. తన క్లయింట్ ఓ డ్రైవర్ అని అతడికి దొంగల ప్లాన్ గురించి తెలియదని డ్రైవర్ లాయర్ కోర్టులో వాదించింది. అంతకుముందు ఈ కేసులో అరెస్టయిన దొంగలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముందు డ్రైవర్ కు దీనితో సంబంధం లేదని చెప్పడంతో డ్రైవర్ ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..