భారతీయుడికి బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం
- April 01, 2022
మనామా: బహ్రెయిన్‌లో భారతీయుడికి అరుదైన గౌరవం లభించింది. దీంతో అతడు సంతోషం వ్యక్తం చేశారు. బహ్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియ చేశారు.లులు ఫైనాన్షియల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అదీబ్ అహ్మద్‌కు బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం దక్కింది. గోల్డెన్ రెసిడెన్సీ వీసాతో బహ్రెయిన్ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. బహ్రెయిన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా గోల్డెన్ వీసాను అందుకున్న అదీబ్ అహ్మద్.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బహ్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్‌ను వ్యాపార కేంద్రంగా మార్చడానికి గోల్డెన్ వీసా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. కేరళలో జన్మించిన అదీబ్ అహ్మద్.. యూఏఈ వెళ్లి అక్కడ బిలియనీర్‌గా ఎదిగారు."గోల్డెన్ వీసా అనేది సాంప్రదాయ మరియు కొత్త-యుగం రంగాలలో వ్యాపార కేంద్రంగా బహ్రెయిన్ ఇమేజ్‌ని పెంచే గుర్తింపు యొక్క ప్రమాణం" అని అహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం