స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..

- April 03, 2022 , by Maagulf
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన హై పర్ఫార్మెన్స్‌ అనలిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 26

పోస్టుల వివరాలు: High Performance Analyst (Biomechanics/Psychologist)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: బయోమెకానిక్స్‌/సైకాలజీ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 2 సంవత్సరాల పాటు అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.

పూర్తి వివరాల కోసం ఈ క్రింద క్లిక్ చేయండి.

https://sportsauthorityofindia.nic.in/sai/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com