నలుగురు భారతీయులను విడుదల ...
- April 03, 2016
సిరియా ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న నలుగురు భారతీయులను విడుదల చేయించడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. '' అరుణ కుమార్ సైని, సర్వజిత్ సింగ్, కుల్దీప్ సింగ్, జోగ సింగ్‌లకు స్వాగతం'' అని ట్వీట్ చేశారు. వీరు నలుగరు ఐఎస్ ఉగ్రసంస్థలో చేరేందుకు వచ్చినట్లు భావించిన సిరియా ప్రభుత్వం గత జనవరిలో అరెస్టు చేసింది. ఇటీవల సిరియా ఉప ప్రధాని భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా వారిని విడుదల చేయాలని ఆయన్ను కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.వీరు జోర్డాన్ నుంచి సిరియాలోకి ప్రవేశించి డమాస్కస్‌కు చేరుకోగా.. అక్కడ ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. వీరిని ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానించారు.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









