UAE: పాస్‌పోర్ట్ లలో రెసిడెన్సీ వీసా స్టాంప్ బంద్

- April 05, 2022 , by Maagulf
UAE: పాస్‌పోర్ట్ లలో రెసిడెన్సీ వీసా స్టాంప్ బంద్

యూఏఈ: UAEలోని ప్రవాసులు ఇకపై వారి పాస్‌పోర్ట్ లపై రెసిడెన్సీ వీసాలను ముద్రించాల్సిన అవసరం లేదు.ఏప్రిల్ 11 తర్వాత జారీ చేయబడిన నివాస పత్రాలకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ కోసం ఫెడరల్ అథారిటీ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.దీని ప్రకారం నివాసితుల ఎమిరేట్స్ ID వారి నివాస పర్మిట్ గా పరిగణించబడుతుంది. ఈ IDలో నివాస సంబంధిత సమాచారం ఉంటుంది.నివాసితుల ఎమిరేట్స్ ID,  పాస్‌పోర్ట్ నంబర్ ద్వారా ఎయిర్‌లైన్స్ రెసిడెన్సీ స్టేటస్ ని ధృవీకరిస్తాయి. ప్రజలకు అందించే సేవలను అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో చేసిన క్యాబినెట్ తీర్మానం ఆధారంగా రూపొందించబడింది. రెసిడెన్సీ వీసా అనేది ప్రవాసులు వైద్య పరీక్ష చేయించుకున్న తర్వాత వారి పాస్‌పోర్ట్ లపై స్టాంప్ చేసే స్టిక్కర్. నివాసి కలిగి ఉన్న వీసా ఆధారంగా ఇది రెండు, మూడు, ఐదు లేదా 10 సంవత్సరాల కాలానికి జారీ చేస్తారు.

--సుమన్ కోలగట్ల (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com