నాగ చైతన్య హీరోగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం
- April 06, 2022
హైదరాబాద్ : మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్ లను అందుకున్న నాగ చైతన్య 'థాంక్యూ' చిత్రం విడుదల కు సిద్ధం గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న తన 22వ చిత్రం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నారు. నావెల్ కంటెంట్‌తోపాటు సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు తన `మానాడు` చిత్రం తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.
రామ్ నటిస్తున్న `వారియర్` మరియు బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్ చిత్రంతో సహా కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్ట్ లను చేయబోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకాకాలంలో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని హైటెక్నికల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్ లో నిర్మించనున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, మరియు అనుభజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తారాగణం: నాగ చైతన్య
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
సమర్పణ- పవన్ కుమార్
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్ట
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









