ఏపీ: ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
- April 06, 2022
అమరావతి: ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది.ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అపాయింట్మెంట్ను జగన్ కోరనున్నారు.
మరోవైపు ఈనెల 7న ప్రస్తుత కేబినెట్‌తో చివరి భేటీని సీఎం జగన్ నిర్వహించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు రాజీనామా లేఖలు సమర్పించనున్నారు.ఈనెల 8న గవర్నర్‌ను కలిసి సీఎం జగన్ కొత్త మంత్రుల జాబితా ఇవ్వనున్నారు.మంత్రుల రాజీనామాలను అదేరోజు గవర్నర్ ఆమోదించనున్నారు.ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది.ఈనెల 11న ఉ.11:30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







