యువి క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ హీరోగా షూటింగ్ దశలో సినిమా

- April 08, 2022 , by Maagulf
యువి క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ హీరోగా షూటింగ్ దశలో సినిమా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ దర్శక నిర్మాతలు విడుదల చేశారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు.. సత్య జి ఎడిటర్. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు:
కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ళ భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ

సాంకేతిక నిపుణులు -
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి
నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com