ఏపీలో ‘మీ సేవ’ ఛార్జీలు పెంపు
- April 11, 2022
అమరావతి : ఏపీలో మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను ప్రభుత్వం నేటి నుంచి పెంచింది. కేటగిరి – ఎ, కేటగిరి – బి కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను రూ.5 మేర పెంచింది. దీని ద్వారా ఏడాదికి సుమారు రూ.60 కోట్ల భారం సామాన్య ప్రజలపై పడనుంది. ఇప్పటికే వివిధ ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో… ఈ పెంపుతో వారిపై అదనుపు బాదుడు మోపుతుంది.
మీ సేవ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సుమారు 512 రకాల సేవలు అందుతాయి. దీనికి సర్వీసు ఛార్జీ కింద ఎ కేటగిరి కింద 35, బి కేటగిరి కింద 45 రూపాయల వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇందులో నిర్వాహకులకు చెల్లించే మొత్తం పోనూ… మిగిలిన మొత్తం ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఇవాళ్టి నుంచి సర్వీసు ఛార్జీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులకు సంబంధింత శాఖ ఆదివారం సాయంత్రమే సమాచారం పంపింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







