ఎన్టీఆర్.అట్లీతో చర్ఛలు
- April 04, 2016
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న న్యూస్ విజయ్ నటించిన తేరి మూవీ. ఈ మూవీ యూ ట్యూబ్ లో రిలీజ్ అయిందో..లేదో, వెంటనే సంచలన రికార్డ్స్ ని సాధించింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అట్లీ. 'రాజా రాణి' సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ, సూపర్ స్టార్ విజయ్ తో మూవీని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక విజయ్ హీరోగా వస్తున్న ఈ మూవీని తెలుగులో పోలీసోడు' పేరుతో ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైపోయింది. అయితే డైరెక్టర్ అట్లీకి సినిమాల మీత కచ్ఛితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంతే కాకుండా కమర్షియల్ హంగులు ఉన్న చిత్రాలను ఏ విధంగా తెరకెక్కించాలి వంటి టెక్నిక్స్ అట్లీకి బాగా తెలుసు అనేది ఇండస్ట్రీ అభిప్రాయం.మరి ఈ డైరెక్టర్ తో నటించాలని పలువురు స్టార్ హీరోలు చర్ఛలు జరుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన టాప్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.అట్లీతో చర్ఛలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. 'రాజా రాణి' తర్వాత తెలుగు, తమిళంలో ఎన్నో అవకాశాలు అట్లీకి వచ్చాయి. కానీ అట్లీ మాత్రం విజయ్ డేట్స్ కోసం ఎదురు చూసి ఆఫర్ చేజిక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత అట్లీ దర్శకత్వంలో చేసే ఆలోచన ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ సైతం అట్లీకి భారీ ప్యాకేజ్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అట్లీ దర్శకత్వం చేసిన తేరి మూవీని తెలుగులో దిల్రాజు విడుదల చేస్తుండడంతో, ఈ మూవీకి భారీ ప్రమోషన్స్ ని చేపడుతున్నాడు. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







