లావణ్య త్రిపాఠి,భార్గవి, హరిత ప్రారంభించిన అరవింద డిజైనర్ స్టూడియో

- April 12, 2022 , by Maagulf
లావణ్య త్రిపాఠి,భార్గవి, హరిత  ప్రారంభించిన  అరవింద డిజైనర్ స్టూడియో

 హైదరాబాద్: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 36 లో కొత్త ఏర్పాటు చేసిన అరవింద డిజైన్‌ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో విభిన్న రకలైనా వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక లావణ్య త్రిపాఠి తో పాటు డిజైనర్లు భార్గవి, హరిత తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టు అంటే చాలా ఇష్టమని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు. త్వరలోనే ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె తెలిపారు. వస్త్రాభిమానులకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాలతో పాటు ఎక్సక్లూజివ్ కాంజీవరం శారీస్,  కంచుపట్టు చీర, గద్వాల్‌ శారీస్‌, కోటా ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ శారీస్ అందిస్తున్నట్లు అరవింద డిజైనర్‌ స్టూడియో  ఎండీ భార్గవి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com