రవితేజ నటిస్తున్న 'రావణాసుర' భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి
- April 12, 2022
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రావణాసుర` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యుల్ లో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో ఇది కీలకమైన షెడ్యూల్. దీంతో చిత్రీకరణకు సంబధించి మూడు షెడ్యూల్లా షూటింగ్ పూర్తయింది.
అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి ఫస్ట్ లుక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లకు ప్రాధాన్యత వుంది. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు సుధీర్ వర్మ , మాస్ మహారాజా రవితేజని ఈ చిత్రంలో సరికొత్తగా చూపించబోతున్నారు.
ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ ద్వయం సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్
డీఓపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్‌కే కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో : వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







