ఆచార్య ట్రైలర్ వచ్చేసింది..!
- April 12, 2022
హైదరాబాద్: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ట్రైలర్ రానే వచ్చింది.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్.. మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన చిత్ర ట్రైలర్ కన్నుల పండుగగా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చిరంజీవి, చరణ్ ల మధ్య వచ్చే సీన్స్ గూస్ బంబ్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి ట్రైలల్‌లో కాస్త లేటుగా వచ్చినా... ఆయన ఎంట్రీ లేటెస్టుగా ఉంది.
టీజర్, పాటలతో సినిమా పైన ఇప్పటికే హైప్స్ పెరగగా, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. కొణిదెల, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







