ఇఫ్తార్ ఫిరంగి కాల్పులకు దుబాయ్ పోలీసుల ఏర్పాట్లు
- April 15, 2022
యూఏఈ: అల్ మన్ఖూల్లోని ఈద్ ప్రార్థనా మైదానంలో ఇఫ్తార్ ఫిరంగి పేలుళ్లను చూసేందుకు దుబాయ్ పోలీసులు నివాసితులను ఆహ్వానించారు. సాంప్రదాయ ఫిరంగిని ఏప్రిల్ 14, 15 తేదీలలో సూర్యాస్తమయం సమయంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 1960వ సంవత్సరం ప్రారంభం నుండి ఈ ప్రసిద్ధ సంప్రదాయం అమల్లో ఉన్నది. పవిత్ర రమదాన్ మాసంలో ప్రతి రోజూ ఇఫ్తార్ సమయంలో రెండు సార్లు ఫిరంగులను పేల్చుతారు. ఈ సంవత్సరం ఎమిరేట్‌లోని ఐదు ప్రదేశాలలో ఫిరంగులను దుబాయ్ పోలీసులు ఏర్పాటు చేశారు. అట్లాంటిస్ ది పామ్, బుర్జ్ ఖలీఫా, అల్ సీఫ్, సెంచరీ మాల్, దుబాయ్‌లోని అల్ వహెదా, ఎమిరేట్స్ కోఆపరేటివ్ సొసైటీ, హట్టా హిల్ పార్క్ ముందు ఫిరంగులను ఏర్పాటు చేశారు. ఎమిరేట్‌లోని 11 ప్రాంతాలలో మొబైల్ ఫిరంగులను ఏర్పాటు చేశారు. బిగ్ మస్జీదు సమీపంలో అల్ సత్వా; అల్ అన్బియా మస్జీదు సమీపంలో అల్ ఖౌజ్; అల్ నహ్దా నేషనల్ స్కూల్ సమీపంలో అల్ లిసైలీ; లహబాబ్ కమ్యూనిటీ పార్క్ 1 సమీపంలో లహబాబ్; షేక్ హమ్దాన్ మస్జీదు సమీపంలో అల్ అవీర్; అహ్మద్ అల్ హబ్బాయి మస్జీదు సమీపంలో అల్ ఖవానీజ్; అబ్దుల్ రహీమ్ మొహమ్మద్ క్తి మస్జీదు దగ్గర ముహైస్నా ప్రాంతాలలో మొబైల్ ఫిరంగులను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!