ఆది కొత్త చిత్రం ప్రారంభమయ్యింది

- June 11, 2015 , by Maagulf
ఆది కొత్త చిత్రం ప్రారంభమయ్యింది

సునీల్ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రాల్లో 'పూలరంగడు' ఒకటి. దానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. వాస్తవానికి ఆ చిత్రంలో ఆది హీరోగా నటించాల్సింది.కానీ, అప్పటికి ఆ కాంబినేషన్ కుదరలేదు. 'చుట్టాలబ్బాయ్' చిత్రంతో ఇప్పటికి కుదిరింది. రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది.ముహూర్తపు దృశ్యానికి రచయిత గోపీమోహన్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ''సాయికుమార్‌గారికి, ఆదికి ఈ కథ బాగా నచ్చింది. నా దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' తరహాలో ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదంతో సాగుతుంది. అయితే, ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది'' అన్నారు.అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న సినిమా అనీ, తన సినిమాకు థమన్ తొలిసారిగా పాటలిస్తున్నారనీ ఆది చెప్పారు. ఈ ఏడాది విడుదలయ్యే మంచి చిత్రాల్లో ఇది కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com