ఆది కొత్త చిత్రం ప్రారంభమయ్యింది
- June 11, 2015
సునీల్ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రాల్లో 'పూలరంగడు' ఒకటి. దానికి వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. వాస్తవానికి ఆ చిత్రంలో ఆది హీరోగా నటించాల్సింది.కానీ, అప్పటికి ఆ కాంబినేషన్ కుదరలేదు. 'చుట్టాలబ్బాయ్' చిత్రంతో ఇప్పటికి కుదిరింది. రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది.ముహూర్తపు దృశ్యానికి రచయిత గోపీమోహన్ కెమెరా స్విచాన్ చేయగా, నటుడు సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ''సాయికుమార్‌గారికి, ఆదికి ఈ కథ బాగా నచ్చింది. నా దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' తరహాలో ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదంతో సాగుతుంది. అయితే, ఇందులో యాక్షన్ కూడా ఉంటుంది'' అన్నారు.అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్న సినిమా అనీ, తన సినిమాకు థమన్ తొలిసారిగా పాటలిస్తున్నారనీ ఆది చెప్పారు. ఈ ఏడాది విడుదలయ్యే మంచి చిత్రాల్లో ఇది కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







