సలాలా విమానాశ్రయంలో 89% పెరిగిన ప్రయాణికుల సంఖ్య

- April 17, 2022 , by Maagulf
సలాలా విమానాశ్రయంలో 89% పెరిగిన ప్రయాణికుల సంఖ్య

ఒమన్: 2022 మొదటి త్రైమాసికంలో సలాలా విమానాశ్రయం రికార్డు సృస్టించింది. సుల్తానేట్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్యలో 89 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుల్తానేట్ నుండి బయలుదేరే ప్రయాణీకుల సంఖ్య 72 శాతం పెరిగింది. సలాలా ఎయిర్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అవద్ అల్ యాఫీ మాట్లాడుతూ.. ఒమన్ విమానాశ్రయాలు సంబంధిత విభాగాలు జారీ చేసిన అన్ని ముందుజాగ్రత్త చర్యలను అమలు చేశామన్నారు. సలాలా విమానాశ్రయం ఏప్రిల్ 29న అబుదాబి నుండి విజ్ ఎయిర్ యొక్క మొదటి ప్రత్యక్ష విమానాన్ని( వారానికి 14 విమానాలు) నడుపుతామన్నారు. అలాగే గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుండి 2022 జూన్ 28 నుండి సెప్టెంబరు 29 వరకు వారానికి రెండు విమానాలను నడుపుతుందని, అలాగే కువైట్ నుండి వారానికి 5 విమానాలు, జూన్ 2 నుండి ఆగస్టు 30 వరకు సౌదీ అరేబియా నుండి ఫ్లైనాస్ కోసం వారానికి మూడు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com