ప్రభుత్వ ఉద్యోగిని దుర్భాషలాడిన వ్యక్తి అరెస్ట్
- April 17, 2022
బహ్రెయిన్ : మునిసిపల్ ఉద్యోగిని పనిలో ఉన్నప్పుడు దుర్భాషలాడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన ఆస్తిపై విధించిన ఉల్లంఘనల ఆర్డర్‌ను అమలు చేస్తున్న అధికారి విధులను అడ్డుకొని, అతని పరువు తీయడం, ఆ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన ఒక వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. కాగా విచారణ సమయంలో సదరు నిందితుడు తనపై దాఖలైన అభియోగాలను తిరస్కరించాడు. మునిసిపాలిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అర్బన్ ప్లానింగ్ ఉద్యోగులు వారెంట్ లేకుండా తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం చేశారని పేర్కొంటూ వీడియో పోస్ట్ చేసిన విషయాన్ని అంగీకరించాడు. కేవలం తనకు ఉన్న హక్కను కాపాడుకునేందుకు మాత్రమే అలా చేసినట్లు కోర్టుకు తెలిపాడు. అనంతరం ప్రాసిక్యూషన్ కేసును దిగువ క్రిమినల్ కోర్ట్ కు రిఫర్ చేసింది. అక్కడ కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







