మే 3-5 నుంచి దోహా కార్నిచ్‌లో ఈద్ ఫెస్టివల్
- April 18, 2022
దోహా: మే 3-5 నుండి దోహా కార్నిచ్‌లో మొట్టమొదటి ఈద్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు ఖతార్ టూరిజం ప్రకటించింది. కరోనా పరిమితులు ఎత్తివేసిన తర్వాత వస్తున్న ఈద్‌ను ఘనంగా జరుపేందుకు టూరిజం శాఖ ప్రణాళికతలు రూపొందించింది. వ్యక్తిగత ఈవెంట్లను అనుమతించడంతోపాటు, ఈద్ ఫెస్టివల్లో దేశంలోని మొట్టమొదటిసారిగా భారీ బెలూన్ పరేడ్, మార్చింగ్ బ్యాండ్లు, కార్నివాల్ గేమ్‌లు, బాణసంచా, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ టూరిజం చైర్మన్, ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఇ అక్బర్ అల్ బేకర్ తెలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని టూరిజం శాఖ అద్భుత ఏర్పాట్లు చేస్తుందన్నారు. అలాగే ఖతార్ టూరిజం ఏడాది పొడవునా దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించే ఉత్పత్తులు, సేవలు, ఈవెంట్లను ప్రైవేట్ రంగాల భాగస్వాములతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







