ముస్లింలకు ఏపీ సీఎం జగన్ శుభవార్త
- April 19, 2022
అమరావతి: ముస్లింలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు.ఈ నెల 26న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి.స్టేడియాన్ని మంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అధికారులు పరిశీలించారు.
ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు డెప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఐదు వేల మంది ఇఫ్తార్ విందుకు హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తరహాలో పండుగలకు తోఫాలు ఇచ్చి సరిపెట్టం.. భారీగా సంక్షేమం అమలు చేస్తున్నాం…తోఫాల పేరుతో అవినీతి చేసే పద్దతి మాది కాదని వెల్లడించారు అంజాద్ బాషా.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







