భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్..

- April 21, 2022 , by Maagulf
భారత్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని జాన్సన్..

గుజరాత్: బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి బయల్దేరిన ఆయన గురువారం ఉదయం (ఏప్రిల్ 21) గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంధ్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ యూకే ప్రధానికి సాదారంగా స్వాగతం పలికారు.జాన్సన్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. అలాగే, అహ్మదాబాద్ మేయర్, రాష్ట్ర సీఎస్, గుజరాత్ పోలీసు డీజీ ఆశిష్ భాటియా, జిల్లా కలెక్టర్, అహ్మదాబాద్ నగర పోలీసు కమిషనర్ కూడా విమానాశ్రయంలో జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు. 

మనదేశంలో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ప్రధాని జాన్సన్ పర్యటించనున్నారు. దేశంలో వ్యాపారం, ప్రధానంగా స్వేచ్ఛా వాణిజ్యం, ఇంధన రంగం, రక్షణ పరంగా అవసరమైన సత్సాంబంధాలను కొనసాగించడంలో భాగంగా యూకే ప్రధాని దేశంలో పర్యటించనున్నారు. మొదటి రోజు తన పర్యటనలో గుజరాత్‌లోనే జాన్సన్ గడపనున్నారు.ఈ రోజు రాత్రి భోజనం తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు.ఇంతకు ముందు PM జాన్సన్ భారత్ పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నించినా కోవిడ్ కారణంగా పర్యటన రద్దు అయింది. కరోనా ప్రభావం తగ్గడంతో జాన్సన్ భారత్‌లో పర్యటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com