హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాల మళ్లింపు
- April 21, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాలను మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు అధికారులు మళ్లించారు. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగుళూరుకు మళ్లించారు. గచ్చిబౌలి, షేక్‌పేట్, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, ఉప్పల్‌లో వర్షం పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!







