బరువు కొలిచే యంత్రం ద్వారా 1Dh కే పాదచారుల బరువు కొలుస్తున్న బిచ్చగాడి అరెస్ట్

- April 22, 2022 , by Maagulf
బరువు కొలిచే యంత్రం ద్వారా 1Dh కే పాదచారుల బరువు కొలుస్తున్న బిచ్చగాడి అరెస్ట్

దుబాయ్: దుబాయ్ పోలీస్, ఓ బిచ్చగాడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.బరువు కొలిచే యంత్రంతో 1 దిర్హాము వ్యయంతో పాదచారుల బరువు కొలుస్తున్నట్లు నింతుడిపై పోలీసులు అభియోగాలు మోపారు.యాంటీ ఇన్‌ఫిల్ట్రేటర్స్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ అదిది మాట్లాడుతూ, అల్ మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్ సాయంతో ఈ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇది కొత్త తరహా బిచ్చమెత్తుకోవడమని ఆయన వివరించారు. ఇలాంటి బిచ్చగాళ్ళని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 901 ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com