త్వరలో యూఏఈ కరెన్సీ టీ-బాండ్ల జారీ

- April 23, 2022 , by Maagulf
త్వరలో యూఏఈ కరెన్సీ టీ-బాండ్ల జారీ

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ త్వరలో స్థానిక కరెన్సీలో మొదటి సారిగా ట్రెజరీ బాండ్లను విక్రయించనుంది.ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. ఈ ఏడాది మే నుంచి సంవత్సరం చివరి మధ్య ఎనిమిది వేలం పాటల ద్వారా 9 బిలియన్ దిర్హామ్‌లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో T-బాండ్‌లు రెండు, మూడు, ఐదు, పది సంవత్సరాల కాల వ్యవధితో జారీ చేయబడతాయి.అబుదాబి కమర్షియల్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్‌బిడి, ఫస్ట్ అబుదాబి బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసి, మష్రెక్, స్టాండర్డ్ చార్టర్డ్ టి-బాండ్‌ల జారీకి ప్రాథమిక డీలర్‌లుగా ఎంపిక చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com