సోహార్ విమానాశ్రయం అభివృద్ధికి సీఏఏ ప్రణాళికలు
- April 23, 2022
మస్కట్: సోహార్ ఎయిర్పోర్ట్ లో కెపాసిటీ, ఆపరేషన్ గంటల సంఖ్యను పెంచడానికి సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఛైర్మన్ ఎం. నయేఫ్ బిన్ అలీ అల్ అబ్రి సోహర్ ఎయిర్పోర్ట్ లో పర్యటించింది. అలాగే నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్ విలాయత్‌లో లాజిస్టికల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేషన్‌పై రెండవ వర్క్ షాప్ ను రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ రూపొందించిన విజన్ లో సోహార్ విమానాశ్రయం నుండి తమ విమానాలను నడపడానికి జాతీయ విమానయాన సంస్థలను ప్రేరేపించడం, విమానాల కోసం ఎయిర్ పోర్ట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించడం, రాత్రి సమయాల్లో కార్యాచరణ పని గంటలను పెంచడం, సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాలు, భూ రవాణా, ఓడరేవుల మధ్య అనుసంధానం తదితర అంశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







