షేక్‌ జాయెద్‌ రోడ్‌లో పలు వాహనాల ధ్వంసం

- April 05, 2016 , by Maagulf
షేక్‌ జాయెద్‌ రోడ్‌లో పలు వాహనాల ధ్వంసం

ఓ యాక్సిడెంట్‌లో పలు వాహనాలు ధ్వంసమైన ఘటన షేక్‌ జాయెద్‌ రోడ్‌లో చోటు చేసుకుంది. మాల్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మోటరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు ట్రాఫిక్‌ ఝామ్‌పై వాహనదారుల్ని అప్రమత్తం చేశారు. దుబాయ్‌ మెరినీ టవర్స్‌ నుంచి మాల్‌ ఆఫ్‌ బఎమిరేట్స్‌ వైపు వెళ్ళే షేక్‌ జాయెద్‌ రోడ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంతో పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే, మేదాన్‌ బ్రిడ్జ్‌ నుంచి జబెల్‌ అలీ వెళ్ళే అల్‌ ఖైల్‌ రోడ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడా ట్రాఫిక్‌ సమస్యలు కలిగాయి. మోటరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com