యాక్షన్ స్టార్ జాకీచాన్ బాలీవుడ్ డ్యాన్స్..
- April 05, 2016
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీచాన్ కొద్ది రోజులు భారత్ లో సందడి చేస్తున్నాడు. తన కొత్త సినిమా కుంగ్ ఫూ యోగా కోసం షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇండో చైనీస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీతో పాటు పలువురు భారతీయ నటులు కూడా కనిపించనున్నారు. ఇందులో భాగంగా తాజా షెడ్యూల్ లో జాకీ చాన్, సోనూసూద్ లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొరియోగ్రాఫిలో జాకీ చేసిన ఇండియన్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జోద్ పూర్, మండోర్ గార్డెన్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలను కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ వెల్లడించారు. జాకీచాన్ తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫరా, 'యాక్షన్ కింగ్ డ్యాన్ కూడా చేస్తాడు.తన పేరును జాకీ జాక్సన్ గా మార్చుకోనున్నాడు' అంటూ కామెంట్ చేశారు. సోనూ సూద్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్స్ అమైరా దస్తర్, దిశ పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







