రియాల్టీ రంగంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ: బహ్రెయిన్
- April 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని రియల్ ఎస్టేట్ లావాదేవీలలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారులను సురక్షితంగా కనెక్ట్ చేయడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడతాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఇప్పుడు బహ్రెయిన్‌లో ఈ పద్ధతిలో మార్పులు తీసుకురానుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు బ్లాక్‌చెయిన్ ను ప్రవేశపెట్టేందుకు బహ్రెయిన్ సిద్ధమైంది. రియాల్టీ రంగంలో బ్లాక్‌చెయిన్ గణనీయమైన మార్పులు తెస్తుందని బహ్రెయిన్ భావిస్తోంది. దీంతో కింగ్డమ్ ఒక ప్రముఖ బ్లాక్‌చెయిన్ ఇన్నోవేటర్‌గా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







