లేబర్ డే, ఈద్ అల్-ఫితర్ సెలవులపై సర్క్యులర్ జారీ

- April 26, 2022 , by Maagulf
లేబర్ డే, ఈద్ అల్-ఫితర్ సెలవులపై సర్క్యులర్ జారీ

బహ్రెయిన్ : రాబోయే లేబర్ డే, ఈద్ అల్-ఫితర్ సెలవులపై క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సర్క్యులర్ జారీ చేశారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1 (ఆదివారం)న మంత్రిత్వ శాఖలు, అన్ని ఇతర ప్రభుత్వ సంస్థలు మూసివేయబడతాయి. అలాగే ఈద్ అల్ ఫితర్ రోజున, ఆ తర్వాత వచ్చే రెండు రోజులపాటు ప్రబుత్వ, ప్రైవేట్ సంస్థలు మూసివేయాలని సర్క్యులర్ లో ఆదేశించారు. నిర్దేశిత మూడు ఈద్ రోజులలో ఏదైనా అధికారిక సెలవుదినం ఉంటే బదులుగా ఒక అదనపు రోజు సెలవుగా ప్రకటిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com