ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్
- April 26, 2022
ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు ఇస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్‌కు ట్విటర్ అంగీకరించింది. మొత్తం డీల్ 4400 కోట్ల డాలర్లు (రూ. 3,38,184 కోట్లు)గా నిర్ణయించారు. డీల్ తరవాత ట్విటర్ ప్రైవేట్ కంపెనీగా మారిపోతుంది. కొత్త ఫీచర్స్‌తో ట్విటర్‌ను మరింత గొప్పగా తీర్చుదిద్దుతానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. డీల్ తరవాత ట్విటర్ షేర్ 5.7 శాతం పెరిగి 51.70 డాలర్లకు చేరింది. మస్క్ ఆఫర్ ప్రకటించినపుడు అప్పటి ధరకు 40 శాతం ప్రీమియంకు ప్రకటించారు. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి రాత్రి 51.70 డాలర్లకు చేరింది. మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్లకు ఈ షేర్ త్వరలోనే రానుంది. గత ఏడాది ట్విటర్ 70 డాలర్ల వద్ద ట్రేడైంది. అంటే చౌకగానే ట్విటర్ కంపెనీ మస్క్‌కు దక్కిందనే చెప్పాలి. కంపెనీ విలువను ఇన్వెస్టర్లు సరిగా అంచనా వేయనపుడు…ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి పెద్ద కంపెనీలు ఈజీగా వెళ్ళిపోతాయనిబోయర్ వ్యాల్యూ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జోనాథన్ బోయర్ అన్నారు. ఈ కంపెనీకి కూడా ట్విటర్లో వాటాలు ఉన్నాయి.
🚀💫♥️ Yesss!!! ♥️💫🚀 pic.twitter.com/0T9HzUHuh6
— Elon Musk (@elonmusk) April 25, 2022
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







