సౌదీ లో తెలంగాణ వాసి మృతి...GWAC ఆపన్నహస్తం!

- April 29, 2022 , by Maagulf
సౌదీ లో తెలంగాణ వాసి మృతి...GWAC ఆపన్నహస్తం!

తెలంగాణ/సౌదీ: తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా, మురిమడుగు గ్రామానికి చెందిన దుబ్బ రాజం కుటుంబ పోషణ కోసం,ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది.విధి నిర్వహణలో సమయంలో ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది.తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మరణ వార్త తెలియగానే GWAC సౌదీ శాఖ ఉపాధ్యక్షులు చిన్నయ్య విషయం తెలుసుకొని రఫీక్ కు తెలిపిన వెంటనే ఇండియన్ ఎంబసీ కి తెలియజేయడం జరిగింది.GWAC జెద్దా ఇంచార్జ్ జాడి మల్లేశం మరియు రాజ్ కుమార్, ఆనంద్, సతీష్ ,కృష్ణ అందరూ కలిసి దుబ్బ రాజు పనిచేసే క్యాంపుకు వెళ్లి మాట్లాడటం జరిగింది. జాడీ మల్లేశం మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు గాను కావలసిన పత్రాలు/క్లియరెన్స్ లను హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎంబిసి వద్ద నుండి సేకరించడటం జరిగింది.ఇండియన్ ఎంబసీ సహాయం, సౌదీలోని GWAC సంస్థ సభ్యుల సహకారం మరియు దుబ్బ రాజు వాళ్ళ కంపెనీ లో పని చేసే వారి సహకారం కూడా ఈ కార్యక్రమానికి దోహదపడ్డాయి.

హైదరాబాద్ విమానాశ్రయం నుండి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ బడుగు లక్ష్మణ్, NRI డిపార్ట్మెంట్ చిట్టిబాబు ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రస్తుతం సౌదీ అరేబియా లోనే తెలంగాణ గల్ఫ్ కార్మికుల మృతదేహాలు 3 ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ లో చనిపోయిన మృతదేహాలను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన మాట తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి,500 కోట్ల నిధులతో NRI పాలసీ అమలు చేసి గల్ఫ్ చనిపోయిన మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయలు ఎక్గ్రేషియా తక్షణమే ప్రకటించాలి అంటూ గల్ఫ్ లో నివసిస్తున్న కార్మికులు డిమాండ్ చేయటం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com